
టాలెంట్ గుర్తించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ వినూత్న ప్రోగ్రాం
హైదరాబాద్, వెలుగు: డిజిటల్, ఆన్లైన్ పాఠాలు స్టూడెంట్స్‌కు ఎంతవరకు అర్థమయ్యాయో తెలుసుకునేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇంటింటా చదువుల పంట ప్రోగ్రాంలో భాగంగా ‘వాట్సాప్ చాట్ బాట్’ పేరుతో సబ్జెక్టు ప్రాక్టీస్ చేసే చర్యలను మొదలుపెట్టారు. దీని కోసం 85955 24405 వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఫస్ట్ నుంచి టెన్త్ క్లాసు వరకు స్టూడెంట్స్ వారంలో రెండు సబ్జెక్టులను ఎంచుకొని వాట్సాప్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. వాట్సాప్‌లో ఈ నంబర్‌కు హాయ్/హాలో/నమస్తే అని పంపించాలి. తర్వాత మొబైల్లో అడిగిన వివరాలను ఎంపిక చేసుకోవాలి. సబ్జెక్టుకు సంబంధించి ఒక్కో ప్రశ్నకు జవాబు చెబుతున్నా కొద్దీ 10 ప్రశ్నల వరకు వస్తాయి. తప్పు చెబితే కరెక్ట్ ఆన్సర్‌తో వీడియోను పంపిస్తారు. ఇలా వారానికి రెండు సబ్జెక్టులు ప్రాక్టీస్ చేసుకోచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రతి స్టూడెంట్ వాడుకునేలా ఆదేశాలివ్వాలని డీఈవోలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు.