రూ.62 వేలకోట్లు కడతావా?.. జైల్లో ఉంటావా?

సహారా ఇండియా పరివార్ గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్  రూ.62,600 కోట్లు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని  సెబి..,సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో బెయిల్ రద్దు చేయాలని కోరింది.  2012, 2015లలో కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించలేదని  ఫిర్యాదులో పేర్కొంది. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం సొమ్మును 15 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని గతంలో కోర్ట్ ఆదేశాలు జారీచేసినట్లు గుర్తు చేసింది.  గతంలో సహారా ఇండియా కొంతమేర డిపాజిట్ చేసిందని , మిగిలిన సొమ్ముతోపాటు వడ్డీలు కలిపి భారీగా రూ. 62,600 కోట్లకు చేరినట్లు సుప్రీం కోర్ట్ కు సెబీ వివరించింది. తాజాగా సెబీ సుబ్రతా రాయ్ రూ.62వేల కోట్లను కట్టాలని లేదంటే బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్ట్ కు విజ్ఞప్తి చేయడం చర్చాంశనీయంగా మారింది.

Latest Updates