‘విరించి’లో సక్సెస్ ఫుల్​గా కిడ్నీమార్పిడి..భార్య కిడ్నీ భర్తకు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని విరించి హాస్పిటల్ లో సక్సెస్ ఫుల్ గా కిడ్నీ మార్పిడి చేశారు. హైదరాబాద్‌‌కు చెందిన రాజ్‌‌కుమార్‌‌‌‌ రెండు కిడ్నీలు ఫెయిల్‌‌కావడంతో బంజారాహిల్స్‌‌లోని విరించి హాస్పిటల్‌‌లో అడ్మిట్‌‌ అయ్యారు. కిడ్నీ ట్రాన్స్‌‌ప్లాంటేషన్‌‌ చేయాలని డాక్టర్లు సూచించారు. రాజ్‌‌కుమార్‌‌‌‌కు కిడ్నీ డొనేట్‌‌ చేయడానికి ఆయన భార్య రేవతి ముందుకొచ్చింది. అదే సమయంలో ఆమెకు కరోనా సోకింది. దీంతో కిడ్నీ ట్రాన్స్‌‌ప్లాంటేషన్‌‌ వాయిదా పడింది. ఈ సమయంలో రాజ్‌‌కుమార్‌‌‌‌కు కాథెటర్‌‌‌‌ హెల్ప్‌‌తో డాక్టర్లు డయాలసిస్‌‌ చేశారు. వైరస్‌‌ నుంచి కోలుకున్న రేవతి.. కిడ్నీ డొనేట్‌‌ చేసింది. ఈ నెల 3వ తేదీన కిడ్నీ ట్రాన్స్‌‌ప్లాంటేషన్‌‌ జరిగిందని, పేషెంట్‌‌, ఆయన భార్య కోలుకున్నారని విరించి హాస్పిటల్‌‌ డాక్టర్లు కేఎస్‌‌.నాయక్, జయరాం రెడ్డి, మురళీధర్‌‌‌‌ జోషి, శ్రీనివాస్‌‌ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు.

Latest Updates