మహేశ్వరం వద్ద సుచిర్​ ఇండియా భారీ వెంచర్‌‌

    సుచిర్‌‌ ఇండియా

     సీఈఓ డాక్టర్‌‌ కిరణ్‌‌

     రేపే ప్రారంభిస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: ఐవీ గ్రీన్స్‌‌ పేరుతో రంగా రెడ్డి మహేశ్వరం వద్ద భారీ రియాల్టీ వెంచర్‌‌ను ప్రారంభిస్తున్నట్టు సుచిర్‌‌ ఇండియా ప్రకటించింది. ఇందులో పర్యావరణ సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపింది. ఈ ప్రాజెక్టును రూ.200 కోట్ల వ్యయంతో 69 ఎకరాల్లో నిర్మిస్తుండగా, ఇందులో 650 విల్లా ప్లాట్లు ఉంటాయి. ఇందులోనే 11 పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణం సగం వరకు పూర్తయింది.  విషవాయువుల ప్రభావాన్ని తగ్గించే పది లక్షల మొక్కలను పెంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఇందులోని ఓపెన్‌‌ ప్లాట్ల విస్తీర్ణం 240 చదరపు గజాల నుంచి మొదలవుతుంది.  ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ డాక్టర్‌‌ కిరణ్‌‌ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో ప్లాస్టిక్‌‌ను నిషేధిస్తామని, నీటి పొదుపునకు వాటర్‌‌షెడ్‌‌ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌‌, సినీనటి తమన్నా చేతుల మీదుగా ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తామని కిరణ్‌‌ వివరించారు.

నిర్మాణంలో మరో ఐదు ప్రాజెక్టులు

ఐవీ గ్రీన్స్‌‌ కాకుండా హైదరాబాద్‌‌ వ్యాప్తంగా మరో ఐదు ప్రాజెక్టులను చేపడుతున్నదని, వీటి వాల్యుయేషన్‌‌ రూ.రెండు వేల కోట్ల వరకు ఉంటుందని కిరణ్‌‌ ఈ సందర్భంగా ప్రకటించారు. ‘‘మాకు మొత్తం 19 కంపెనీలు ఉన్నాయి. గతంలో బిహార్‌‌, ఎంపీ వంటి రాష్ట్రాల్లో 16 ప్రాజెక్టులు పూర్తి చేసిన అనుభవం ఉంది.  శ్రీలంక రాజధాని కొలంబోలో రూ.200 కోట్ల వ్యయంతో త్రీస్టార్‌‌ హోటల్‌‌ను నిర్మిస్తున్నాం. షామీర్‌‌పేట వద్ద రూ.100 కోట్ల వ్యయంతో అడ్వెంచర్‌‌ పార్కునూ ఏర్పాటు చేస్తున్నాం. ఆరామ్‌‌గఢ్‌‌లోనూ హౌసింగ్‌‌ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తాం. మరో రెండు ప్రాజెక్టులనూ చేపడతాం.  హైదరాబాద్‌‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కంపెనీకి 600 ఎకరాల భూమి ఉంది ’’ అని ఆయన వివరించారు.

 

Latest Updates