ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ కు ఓపెన్ ప్లాట్లే బెస్ట్

  • మూడేళ్లకోసారి రియల్ మార్కెట్ అప్ గ్రేడ్
  • మారిన రూల్స్ తో చిన్న ఇన్వెస్టర్లకు ఇబ్బందే
  • సిటీ శివారుల్లో బిగ్గెస్ట్ లేఅవుట్ మాదే

హైదరాబాద్, వెలుగు:

సుచిరిండియా… రియల్ ఎస్టేట్ రంగంలో పరిచయమే అక్కర్లేని సంస్థ. గత 15 ఏళ్ల క్రితం ఓపెన్ ప్లాట్లతో మొదలుపెట్టి… హైదరాబాద్ కేంద్రంగా వందల ఎకరాల విస్తీర్ణంలో భూములను అభివృద్ధి చేసి విక్రయించింది. కాలానుగుణంగా మార్కెట్ తీరు మారుతున్నట్లుగానే కస్టమర్ల అభిరుచులు కూడా వైవిధ్యాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికే సొంతింటిని కలిగి ఉన్నవారు. తమకు ఇష్టమైన రీతిలో ఉండే లగ్జరీ విల్లాలు, రిలాక్సేషన్ హోమ్స్ వైపు మొగ్గుచూపుతుండగా.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకున్నవారు ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్  చేస్తున్నారు. సిటీ నుంచి ఓఆర్ఆర్ దాటి మరీ వందలాది వెంచర్లు మార్కెట్ లోకి వస్తుండగా… బ్రాండింగ్, నిర్మాణం, డెవలప్ మెంట్ తీరు, పాటిస్తున్న నిబంధనలకు పక్కాగా ఉంటేనే స్థిరాస్తిని కొనుగోలు చేస్తున్నారని,రియల్ ఎస్టేట్ తీరుతెన్నులపై సుచిరిండియా ఇన్​ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ వై. కిరణ్ ‘వెలుగు’తో మాట్లాడారు.

దేశంలోనే తొలి ఐఎస్ఓ సర్టిఫికేషన్

దేశంలోని తొలి ఐఎస్ఓ సర్టిఫికేషన్ కలిగిన నిర్మాణ రంగ సంస్థ సుచిరిండియా. క్రిస్సెల్ ర్యాంకింగ్ తో అరుదైన గౌరవం దక్కించుకున్నాం. ముఖ్యంగా డెవలపింగ్, కన్ స్ట్రక్షన్ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో ప్రాజెక్టులు మొదలుపెడుతున్నాం. హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని… కరీంనగర్, వరంగల్, విజయవాడ, బెంగళూరు హైవేలకు చేరువలో ప్రాజెక్టులకు రూపకల్పన చేశాం. 15ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఓపెన్ ప్లాటింగ్ మార్కెట్ లో కొనసాగుతుండగా… ఇప్పటివరకు తీసుకొచ్చిన 16 ప్రాజెక్టుల్లో 1.97 లక్షల మంది కస్టమర్లకు చేరువయ్యాం. రూ.1,650 కోట్ల విలువైన ల్యాండ్ బ్యాంకు కలిగిన సంస్థగా ఎదిగాం. సంస్థపై ఉన్న నమ్మకం, నిర్మాణంలో లేటెస్ట్ ట్రెండ్స్  ఫాలో అవడం, అందుబాటు ధరల్లో ఉండే ప్రాపర్టీని ఎలాంటి ఇబ్బందుల్లేని ప్రాజెక్టులుగా తీర్చిదిద్డడంతోనే ఈ రంగంలో సుదీర్ఘ కాలం పాటు ప్రయాణం చేయగలుగుతున్నాం.

చిన్న ఇన్వెస్టర్లకు ఇబ్బందే…

రియల్ రంగంలో మరింత పారదర్శకత, విశ్వాసం, కస్టమర్లకు భద్రత కలిగించేలా ప్రస్తుతం అమలవుతున్న రూల్స్ తో రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద పెద్ద ప్లేయర్లు మాత్రమే నిలదొక్కుకునే పరిస్థితి ఉంది. ఒకప్పుడు 10 శాతం ఇన్వెస్ట్ మెంట్  పెట్టినా..  ప్రాజెక్టును మొదలుపెట్టే అవకాశం ఉండేది.  కానీ రేరా, జీఎస్టీ నిబంధనలతో కనీసం ప్రాజెక్టు మొత్తం ధరలో 70శాతం మేర ఉంటేగానీ సాధ్యమయ్యేలా లేదు. దీంతో ఒకప్పుడు 3 నుంచి 10 ఎకరాల లోపు ఉండే చిన్న ప్రాజెక్టులు చేసే రియల్టర్లకు వర్కవుట్ అవ్వడం లేదు. ఇదే తరహాలో మరో మూడేళ్లలో చిన్న డెవలపర్లు కనుమరుగై… కార్పొరేట్ పంథాలో రియల్ ఎస్టేట్ నడుస్తుంది.

కమర్షియల్ స్పేస్ వస్తే.. రెసిడెన్షియల్ సెగ్మెంట్ కు బూస్ట్

కమర్షియల్ స్పేస్ పెరుగుతుందంటే ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పురోగతికి సూచిక. దీనికి అనుగుణంగా ఆఫీసులు వస్తున్నాయంటే ఉపాధి మార్గాలు పెరుగుతున్నట్లే. దీంతో కొనుగోలు సామర్థ్యం కూడా పెరుగుతున్నట్లే. ఈ క్రమంలో కమర్షియల్ స్పేస్ విస్తరిస్తున్న ప్రాంతాల్లోనే రెంటల్ వ్యాల్యూ, కమర్షియల్ యాక్టివిటీ పెరిగి రెసిడెన్షియల్ సెగ్మెంట్ మరింత దూసుకుపోతుంది. ప్రస్తుతం కమర్షియల్ స్పేస్ కు హైదరాబాద్ హాట్ ఫేవరేట్ గా ఉంది.

మిడ్ లెవల్ సెగ్మెంట్ అయినా…

రూల్స్ ప్రకారం ఓపెన్ ప్లాటింగ్, విల్లా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతున్న మిడ్ లెవల్ సెగ్మెంట్ కు తగినట్లుగా అదనపు హంగులు జోడిస్తే కానీ కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గు చూపడంలేదు. విశాలమైన రోడ్లు, క్లబ్ హౌస్ వంటి వసతులే కాకుండా నిర్మాణ శైలిలో వైవిధ్యం కచ్చితంగా ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. సిటీలో పెరిగిన జనాభాకు తగినట్లుగా ల్యాండ్ బ్యాంక్ లేకపోవడంతో… శివారు ప్రాంతాల వైపు రియల్ వ్యాపారం విస్తరించింది.

బిగ్గెస్ట్ లే అవుట్ సుచిరిండియాదే..

సిటీ శివారుల్లో ఓపెన్ ప్లాట్ల వైపు కస్టమర్లు మొగ్గుచూపుతుండటంతో… భారీ వెంచర్లను ప్రారంభించాం. అన్ని లేఅవుట్లు కూడా డీటీసీపీ, హుడా, తాజాగా హెచ్ఎండీఏ గుర్తింపుతో నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దినవే. కస్టమర్ల మైండ్ సెట్ మారింది. ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫ్యూచర్ గ్రోత్, రేట్ అప్రైజల్ వంటి అంశాలను పక్కాగా అడుగుతున్నారు. దీంతోపాటు పేపర్లపై ప్లాన్ చూపి ప్రాపర్టీలను అమ్మే దశ నుంచి ఫిజికల్ గా చూసి, ఉన్న మౌలిక వసతులు, అందిస్తున్న సౌకర్యాలు, అదనపు హంగులు పక్కాగా ఉంటేనే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రతి మూడేళ్లకోసారి ఆప్ గ్రేడ్ అవుతోంది. గత పదిహేనేళ్లలో ఈ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా వచ్చిన రేరా, జీఎస్టీ వంటి వాటితో మరింత పారదర్శకత వచ్చింది.

మహేశ్వరం వద్ద ఎకో ఫ్రెండ్లీ లే అవుట్..

సిటీలో మారిపోతున్న పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులను ఆవిష్కరించాం. మెరుగైన రవాణా, ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులకు చేరువలో ఉండేలా మహేశ్వరం వద్ద ఐవీ గ్రీన్స్ ప్రాజెక్టును లాంచ్ చేశాం. 69 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ప్లాట్లను విక్రయిస్తున్నాం. లే అవుట్ మొత్తంలో 11 పార్కులను అభివృద్ధి చేశాం.  శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరువలో రిలాక్సేషన్ హోమ్స్ నిర్మిస్తున్నాం. తక్కువ బడ్జెట్ లో వయసు పైబడిన వారికే కాకుండా వీకెండ్ లో ఫ్యామిలీతో సరదాగా ఉండేలా వీటిని నిర్మించాం.

Latest Updates