మందలించారని బిల్డింగ్​ పైనుంచి దూకేసిండు

మందలించారని బిల్డింగ్​ పైనుంచి దూకేసిండు
బాసర ట్రిపుల్​ఐటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

బాసర, వెలుగు: వర్సిటీ ఆఫీసర్లు మందలించడంతో బాసర ట్రిపుల్​ఐటీ స్టూడెంట్​ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. బుధవారం తను ఉంటున్న హాస్టల్​ బిల్డింగ్​ పైనుంచి దూకేసిండు. అతడిని నిజామాబాద్​ ఆస్పత్రికి, తర్వాత హైదరాబాద్​కు తరలించారు. నిజామాబాద్​ జిల్లా జక్రాన్​ పల్లికి చెందిన బోండ్ల సంజయ్.. ​బాసర ట్రిపుల్​ ఐటీలో పీయూసీ ఫస్టియర్  చదువుతున్నడు.

మంగళవారం ఓ స్టూడెంట్​తో సంజయ్​ గొడవపడ్డాడు. ఆ స్టూడెంట్ దీన్ని వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు విచారణ జరిపారు. బుధవారం సంజయ్​ పేరెంట్స్​కు ఫోన్​ చేసి పిలిపించారు. మాట్లాడుతుండగా టాయ్​లెట్​ వెళ్లొస్తానని చెప్పి సంజయ్​హాస్టల్​కు వెళ్లాడు. బిల్డింగ్​ పైకెక్కి దూకాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.

Latest Updates