ప్రధాని కాన్వాయ్ పై బాంబు దాడి

  • సురక్షితంగా బయటపడిన ప్రధాని అబ్దల్లా హమ్దక్

సూడాన్ ప్రధాని అబ్దల్లా హమ్దక్ హత్యాయత్నం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రాజధాని ఖార్తూమ్ లో ప్రధాని కాన్వాయ్ లక్ష్యంగా బాంబు దాడి జరిగింది. ప్రధానితోపాటు ఎవరికీ ఏమీ కాలేదని అధికారులు చెప్పారు. ప్రస్తుతం హమ్దక్ సేఫ్ గా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఈ దాడికి బాధ్యులు ఎవరన్నది తెలియరాలేదు. గత ఏడాది ఆగస్టులో మిలటరీ, ప్రజాస్వామ్య ఉద్యమకారుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు  సూడాన్ ప్రధానిగా హమ్దక్ బాధ్యతలు చేపట్టారు. ప్రెసిడెంట్ ఒమల్ అల్ బషిర్ నిరంకుశ పాలన అంతమైన తర్వాత ఆర్మీ జనరల్స్ డీఫాక్టో రూలర్స్ గా కొనసాగుతున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు పూర్తి స్థాయి పాలనను ప్రజాస్వామ్య ఉద్యమకారులకు అప్పగించేందుకు మిలటరీ సుముఖంగా లేదు.

Latest Updates