ఇసుక తిన్నెలపై గాన గంధర్వుడి సైకత శిల్పం

భువనేశ్వర్: ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘనంగా నివాళులు అర్పించారు. పూరీ బీచ్‌‌లో ఇసుక తిన్నెలపై ఎస్పీ బాలు సైకత శిల్పాన్ని గీసి ఆయనపై తనకు ఉన్న ప్రేమను చాటారు. లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నివాళి, ఒడిషాలోని పూరి బీచ్‌‌లో శాండ్ ఆర్ట్ అంటూ ఎస్పీబీ సైకత శిల్ప ఫొటోలను సుదర్శన్ ట్వీట్ చేశారు. దేశంలోని పలు భాషల్లో కలిపి బాలు 40 వేల పైచిలుకు పాటలు పాడారు. ఆయన మృతితో సంగీత రంగంలో పూడ్చలేని లోటు ఏర్పడిందని సంగీత ప్రియులు బాధపడుతున్నారు. బాలు సైకత శిల్పాన్ని మీరూ చూసేయండి.

Latest Updates