అధిక ఛార్జీ వసూలు చేసిన కండక్టర్ పై 420 కేసు

నల్లగొండ జిల్లా: ఆర్టీసీ సమ్మె కారణంగా అసలే సరైన టైమ్ లో బస్సులు రాక జనం ఇబ్బంది పడుతుంటే.. వచ్చిన ఛాన్స్ దొరికింది కదా అని తాత్కాలిక కండక్టర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో టిక్కెట్ ధర కంటే ఎక్కువగా వసూలు చేస్తున్న ఓ కండక్టర్ ను గురువారం విధుల నుండి తొలగించారు.సమ్మె కారణంగా బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఇప్పటికే పలు చోట్ల జనం ఫిర్యాదు చేస్తున్నారు.దీంతో గురువారం నార్కట్ పల్లిలో నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ ఆర్.టి.సి బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో యాదగిరిగుట్ట డిపోకు రామాంజనేయులు అనే కండక్టరు ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని తెలియడంతో అతన్ని వెంటనే విధుల నుంచి తొలగించి 420 కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఖమ్మం డిపోకు చెందిన మరో కండక్టర్ నాగేశ్వరరావుపై కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చీటింగ్ కేసు నమోదైంది.

Latest Updates