మెట్టుగూడలో సడెన్ గా ఆగిన మెట్రో రైలు

హైదరాబాద్ : మెట్రో రైలు సడెన్ గా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం మెట్టుగూడ మెట్రో స్టేషన్ లో జరిగింది. రాయదుర్గం నుంచి నాగోల్ వెళ్తున్న మెట్రో రైలు టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల మెట్టుగూడా స్టేషన్లో నిలిచిపోయింది. ట్రైన్ రన్నింగ్ లో  లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు ప్రయాణికులు.

వెంటనే మెట్రో సిబ్బంది ప్రయాణికులను అలెర్ట్ చేసి .. మరో రైల్లో పంపారు. ఆగిపోయిన రైలును సిబ్బంది కొంచెం ముందుకు నుంచి అవతలి వైపు ట్రాక్ పై పెట్టడంతో లైన్ క్లీయర్ అయ్యింది. 20 నిమిషాల వరకు ఆ రూట్ లో వెళ్లే మెట్రోలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి.

Latest Updates