కారులో ఒక్కసారిగా మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

మలక్ పేటలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మలక్ పేట రైల్వే స్టేషన్ ప్రధాన రహదారిపై వెళుతున్న కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్జల్ గoజ్ నుంచి ఇబ్రహీం పట్నం వైపు వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్ర‌మాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్ వెంటనే గమనించి కారులో ఉన్న వారిని అప్రమత్తం చేశాడు. అందరిని కిందకి దించేశాడు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ కారులో డ్రైవర్ తో పాటు మొత్తం ఆరుగురు వున్నారు.

 

 

Latest Updates