మెట్రోలో ఇంటర్ నెట్ లేకుండా ఫ్రీగా సినిమాలు చూడొచ్చు

హైదరాబాద్  మెట్రో రైల్లో షుగర్ బాక్స్ నెట్ వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. షుగర్ బాక్స్ నెట్ వర్క్ ను మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి ప్రారంభించారు.

నగర వాసుల్ని ఆకట్టుకునేందుకు మెట్రో అధికారులు ప్రయత్నిస్తున్నారు. మెట్రోలో ప్రయాణించే నగర వాసులకు ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు షుగర్ బాక్స్ యాప్, ఫ్రీ వైఫై ను అందుబాటులోకి తెచ్చారు. తొలిసారిగా పది మెట్రో స్టేషన్ రైళ్లల్లో ఈ సౌకర్యాల్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్ వీఎస్ రెడ్డి తెలిపారు. దీంతో మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఉచితంగా సినిమాల్ని  డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో అన్నీ మెట్రో రైళ్లలో ఈ సౌకర్యాల్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పిన ఆయన …మేదో సంపత్తి కోసం పుస్తకాలు, గేమిండ్, ఫుడ్, ఈకామర్స్, ఈలెర్నింగ్ లను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.

వచ్చే జనవరి నెల పూర్తయ్యేలోగా జేబీఎస్ – ఎంజీబీఎస్ పనులు పూర్తి చేస్తామని మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు మెట్రో లో నాలుగు లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఆర్టీసీ సమ్మె సమయం లో అదనంగా 70వేల మంది ప్రయాణించారన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 30 వేలకు ఉందన్నారు

ఇప్పటి వరకు 14 లక్షల మెట్రో స్మార్ట్ కార్డ్ అమ్ముడుపోయాయని..అందులో ప్రతీ రోజు 2 లక్షల 20 వేల మంది ప్రయాణిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి చెప్పారు.

Latest Updates