బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి…8 మంది మృతి

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని జమీలా మార్కెట్‌లో ఆత్యాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 8మంది అక్కడి కక్కడే చనిపోగా…దాదాపు 15 మంది గాయపడ్డారు.  పేలుడు పదార్ధాలతో తయారు చేసిన బెల్డు ధరించిన ఓ దుండగుడు అత్యంత రద్దీగా ఉండే జమీలా మార్కెట్‌లో తనను తాను పేల్చుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ తిరుగుబాటు దారులు దాడులకు పాల్పడుతున్నారని అధికారులు వివరించారు. తెలిపారు. రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ… తిరుగుబాటు దారులు దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు అధికారులు.