కులం పేరుతో దూషించారని ఆత్మహత్య

అబిడ్స్,- వెలుగు: కులం పేరుతో దూషించారని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కాచిగూడకు చెందిన గణేశ్ కుమార్ (55) రోజు లాగానే రాజామోహల్లాలోని టెంట్ హౌస్ కు శుక్రవారం వచ్చాడు. ఇంటికి రాకపోవడంతో కుమారుడు సాయి స్వరాజ్ శనివారం షాప్ కు వెళ్లి చూడగా ఫ్యాన్ కు ఉరివేసుకొని ఉన్నాడు. కోఠి ప్రాంతానికి చెందిన నిరంజన్ రావు, జైపాల్ రావు, కృష్ణమూర్తి లు తనను కులం పేరుతో దూషించారని, మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు గణేశ్ కు మార్ సూసైడ్ నోట్ లో రాశాడని సుల్తాన్ బజార్ ఇన్ స్పె క్టర్ సుబ్బి రామిరెడ్డి
తెలిపారు.

see also: కనికరంలేని తల్లి: కొడుకుని చంపింది

Latest Updates