మామ కొట్టాడని అల్లుడి ఆత్మహత్య

వెలుగు: భార్యతో జరిగినగొడవలో మామ ఇన్వాల్వ్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ సంఘటన పటాన్‍చెరు పోలీస్ స్టేషన్ పరిధి లో శుక్రవారం జరిగింది .ఇన్స్ స్పెక్టర్ నరేశ్‍ కథనం ప్రకారం.. చిన్న కంచర్లగ్రామానికి చెందిన సయ్యద్ బిపాసా సయ్యద్ సలీం కుమారుడైన సయ్యద్ అన్వర్ (28)కు,ఇస్మాయిల్ ఖాన్ పేటకు చెందిన మేకల షేక్ హుస్సేన్ కూతురు హనీపాతో ఐదేళ్ల క్రితం పెళ్లిజరిగింది. పదిహేను రోజుల క్రితం హనీపా చెల్లి పెళ్లి కోసం ఇస్మాయిల్ ఖాన్ పేటకు భార్యాభర్తలు వెళ్లారు. బుధవారం అక్కడ పెట్టిపోతల విషయంలో అన్వర్ హనీఫాల మధ్య గొడవ జరిగింది. దీంతో హనీపా తండ్రి షేక్ హుస్సేన్అన్వర్ ను కొట్టాడు. మరుసటి రోజు గురువారం తన సొంత గ్రామమైన చిన్న కంచర్ల కు వచ్చి జరిగిన విషయం తన తల్లితో చెప్పి బాధపడ్డాడు. అందరు పడుకున్నాక ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పటాన్‍చెరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates