మహిళ వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

తనతో సహజీవనం చేయాలని మహిళ వేధిస్తుండడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దశంకరంపేట శివాయ పల్లికి చెందిన కిషన్ ఐదేళ్ల క్రితం పటాన్ చెరు పట్టణంలోని నేతాజీ నగర్ కు వచ్చి కూలి పనులు చేసుకుంటున్నాడు. కిషన్ పెద్ద కుమారుడు లింగం (20) పటాన్ చెరువు కు చెందిన సుంకరి మొగులమ్మ ప్రేమించుకున్నారు. మొగులమ్మకు భర్త చనిపోయాడని, ఆమెకు దూరంగా ఉండాలని లింగంను తల్లిదండ్రులు హెచ్చరించారు. అప్పటి నుంచి లింగం ఆమెకు దూరంగా ఉంటున్నాడు. అయితే తనతో సహజీవనం చేయాలని లింగంను వేధించసాగింది. మొగులమ్మ వేధింపులు ఎక్కువవడంతో మనస్థాపానికి గురైన లింగం బుధవారం సూసైడ్‌ నోట్‌ రాసి ఉరేసుకున్నాడు. లింగం తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Latest Updates