రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. భువనగిరి మండలం, ముత్తిరెడ్డి గూడెం-రాయగిరి మధ్యగల రైల్వేట్రాక్ పై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించామని తెలిపారు.

మృతుడిని భువనగిరి మండలం, బస్వాపురం గ్రామానికి చెందిన అన్నంపట్ల వంశీ (23)గా గుర్తించిన పోలీసులు .. వ్యక్తగత కారణాల వల్ల చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

For More News..

ఇంటి నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నరు

కూలీల తరలింపునకు 13 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

విదేశాల్లో దూసుకుపోతున్న ఇండియన్ ఓటీటీలు

Latest Updates