పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం: కేటీఆర్‌

పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అనుకూలంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో మూడో రోజు జరిగిన వింగ్స్‌ ఇండియా-2020 ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. రీజినల్‌ కనెక్టివిటీ పెంచేందుకు పాత ఎయిర్‌పోర్టుల పునరుద్ధరిస్తున్నామన్నారు. విమానాశ్రయాలతో పాటు హెలిపోర్ట్‌, సీ ప్లేన్‌లపై రాష్ట్రం ఆసక్తిగా ఉందన్నారు.  చెందుతోందన్నారు. ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ రంగంలో పెట్టుబడులకు చాలా అవకాశాలున్నాయన్నారు. వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 2,400 ఎయిర్‌క్రాఫ్ట్‌లు అవసరమన్నారు. నిర్వహణ, మరమ్మతుల కేంద్రం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఏవియేషన్‌ రంగంపై జీఎస్టీ తగ్గించేందుకు కేంద్రం విధానపర నిర్ణయం తీసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్.

Latest Updates