బ్యూటీ ఆఫ్ ఇండియా!

జీవితమంటే బాల్యం, యవ్వనం, నడి వయసు, ముసలితనం కదా. అందుకే అన్నీ ముఖ్యమే అనుకుంటడు ఫొటోగ్రాఫర్ సుజన్ సర్కార్. అట్లనే రేపటి ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకున్నడు సుజన్. అందుకే ‘రూరల్ ఇండియా ఫ్యూచర్ ఇండియా’ అంటడు. ఆశలేని మనిషి ఉంటడా. ఆశలంటే పిల్లల్ని బాగా సదివించాలె. వాళ్లు మంచిగ తినాలె, సంతోషంగా ఉండాలనే కదా ఊళ్లో పెద్దోళ్లంతా అనుకునేది. మరి ఆ పెద్దోళ్ల ఆశలే ఇందులో ఉన్నయ్! అందుకే ఇది రూరల్ ఇండియా. ఇదే.. బ్యూటీ ఆఫ్ ఇండియా! మన పోరలు క్రికెటంటె ఎట్ల ప్రాణం పెడతరో, బెంగాల్లో ఫుట్బాల్ ఆటంటే అట్ల.

బడికిపోయి ఇంటికొస్తే బజార్లోనే కాదు నీళ్లల్లో కూడా ఫుట్బాలే ఆడతరు. ఆళ్ల ఆటల తీరు అట్లున్నది! వీళ్లంతా పేదలే. కానీ ఆనందాలకు సంపన్నులు. అమ్యూజ్మెంట్ పార్కులో ఆనందాల కోసం ఆశపడే ప్రపంచం కాదిది. పని కష్టమనుకోకుంటే ఆనందమే. అందమైన చెలకల్లో ఆకుపచ్చని మొలక పెంచేది బిడ్డల కోసమే. పెద్దోళ్లు ఆశలు పెట్టుకున్న పిల్లలు ఆ ఆశల్ని ఎట్ల ముందుకు తోస్తున్నరో చూడున్రి.

గిది లైఫ్ అంటే. చేలకు పోతరు. పనులన్నీ చేస్తరు. చేపలు పడతరు. పెద్దోళ్లకు సాయపడతరు. చేను చెలక పచ్చగున్నంత కాలం మా ఆటపాటలు ఇట్లనే ఉంటయ్ అంటున్న బాల్యమే కాదు. ఆ అందమైన బాల్యాన్ని కోల్పోయిన వాళ్లూ ఉన్నారీ సర్కార్ ఫొటోల్లో. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అంతేకాదు లైఫ్ ఈజ్ డిఫరెంట్!

Latest Updates