ఏడేళ్ల తర్వాత యూఎస్ ఓపెన్‌లో తొలి భారతీయుడు

ఏడేళ్ల తర్వాత యూఎస్ ఓపెన్‌లో మెయిన్ డ్రా సింగిల్స్ మ్యాచ్ గెలిచిన తొలి భారతీయుడిగా సుమిత్ నాగల్ రికార్డుకెక్కాడు. గత ఏడు సంవత్సరాల కాలంలో ఎవరూ ఈ ఘనతను సాధించలేకపోయారు. ప్రస్తుతం యూఎస్‌లో జరుగుతున్న యూఎస్ ఓపెన్‌లో సుమిత్ రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో నాగల్ 6-1, 6-3, 3-6, 6-1తో అమెరికాకు చెందిన బ్రాడ్లీ క్లాన్‌ను ఓడించాడు. దాంతో 23 ఏళ్ల నాగల్ గత ఏడు సంవత్సరాలలో యూఎస్ ఓపెన్‌లో మెయిన్ డ్రా మ్యాచ్ గెలిచిన తొలి భారతీయుడిగా పేరు నమోదు చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు సోమదేవ్ దేవవర్మన్ పేరు మీద ఉంది. ఆయన 2013 లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మరియు యూఎస్ ఓపెన్‌లలో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. క్లాన్‌తో జరిగిన ఫస్ట్ రౌండ్ మ్యాచ్ యొక్క మొదటి రెండు సెట్లలో 6-1, 6-3 తేడాతో ఆధిక్యం సాధించాడు. అయితే మూడో సెట్‌లో మాత్రం క్లాన్.. నాగల్‌ను ఓడించి ఉత్కంఠను రేపాడు. నాలుగో సెట్లో నాగల్.. తన చాకచక్యంతో మళ్లీ పుంజుకున్నాడు. ఈ సెట్లో నాగల్ 5-0 ఆధిక్యాన్ని సాధించాడు. నాలుగు సెట్లలో క్లాన్ ఒక సెట్‌ను మాత్రంమే గెలవగలిగాడు. దాంతో మ్యాచ్ నాగల్ వశమయింది. ప్రపంచంలో 122వ స్థానంలో ఉన్న నాగల్.. తన తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది.

For More News..

నా ప్రతి అడుగులో నాన్న తోడుంది: వైఎస్ జగన్

ఆహార సంక్షోభంలో చిక్కుకున్న చైనా!

బీఈడీ కోర్సుల ఫీజ్ పెంచిన ప్రభుత్వం

Latest Updates