జూన్‌ 10 వరకు మండే ఎండలు

summer-effect-will-continue-till-june-10-weather-report

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో భానుడు భగ్గు మంటున్నాడు. ఉదయం నుంచే నిప్పులు కురిపిస్తున్నాడు. సాధారణ కంటే 5 డిగ్రీలు ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. సాయంత్రం ఆరు దాటితే ఎండలు చల్లారడం లేదు. మరోవైపు రాత్రివేళల్లో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్‌ 10వ తేదీ వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మంచిర్యాల జిల్లాలోని వేమన్‌ పల్లి మండలం నీల్వాల్‌‌లో ఆదివారం అత్యధికంగా 47.8డిగ్రీల గరిష్ట  ఉష్ణో గ్రత నమోదైంది. ఈ సీజన్‌ లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. తర్వాత జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి రాజారామ్‌ పల్లి,ధర్మపురిలో 47.7 , జైనలో 47.6 డిగ్రీల ఉష్ణో గ్రత రికార్డయింది. ఖమ్మంలో 46.2 డిగ్రీలు, రామగుం డంలో 46, ఆదిలాబాద్‌‌లో 45.8 డిగ్రీలునమోదయ్యాయి. ఖమ్మం , హైదరాబాద్‌‌, నిజా-మాబాద్‌‌, మెదక్‌‌లలో 30 డిగ్రీల చొప్పున రాత్రిఉష్ణో గ్రతలు నమోదయ్యాయి.

మరో 15 రోజులు వడగాల్పులు

మరో 15 రోజులు వడగాల్పులు వీస్తాయని  హైదరాబాద్‌‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొం ది. మంగళవారం పొడి వాతావరణం ఉండొచ్చని చెప్పింది.

వరల్డ్‌‌ హాటెస్ట్‌‌ సిటీస్‌‌లో ఆదిలాబాద్‌‌, రామగుండం

ప్రపంచంలోనే అతి ఎక్కువ ఉష్ణో గ్రతలు నమోదవుతున్న ప్రాంతా లు మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. వరల్డ్‌‌ హాటెస్ట్‌‌ సిటీస్‌‌ జాబితాలో ఆదిలాబాద్ ఏడో స్థానం, రామగుండం తొమ్మి దో స్థానంలో నిలిచాయి. నిజామాబాద్‌‌ 14వ స్థానంలో చేరింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వెదర్‌‌ వెబ్‌ సైట్‌‌ ఎల్‌‌డోరడో ఇటీవల వెల్లడించిం ది. ప్రపంచంలోని అత్యంత వేడి ఉన్న నగరంగా ఆఫ్రికాలోని నైజర్‌‌లో ఉన్నబిల్మా రికార్డులకెక్కిం ది. మరోవైపు 15 టాప్‌ నగరాల్లో ఇండియాలోనే 14 సిటీస్‌‌ ఉన్నాయి.మహారాష్ట్రంలోని  బ్రహ్మపురి రెండో స్థానంలో,చంద్రాపూర్‌‌ మూడో స్థానంలో, వర్ధా నాలుగో ప్లేస్‌‌లో ఉన్నాయి.

Latest Updates