రాష్ట్రంలో మండుతున్న ఎండలు: ఖమ్మంలో 45.2 డిగ్రీలు

ఫొని తుఫాను వల్ల రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. వాతావరణంలో ఉన్న తేమను గుంజుకోవడంతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి.  దీనికి తోడు వడగాల్పులు దడ పుట్టిస్తున్నాయి. ఇవాళ అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 44.4 డిగ్రీలు, భద్రాచలంలో 44.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది.

మరో రెండురోజులు వడగాల్పులు కొనసాగుతాయని ప్రకటించింది వాతావరణశాఖ. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు. రేపు.. కుమ్రం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాల పల్లి, భద్రాద్రి, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లా, వరంగర అర్బన్, రూరల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.

Latest Updates