కరోనా సమ్మర్ హాలీడేస్ ను మింగేసింది

న్యూఢిల్లీ : సమ్మర్ హాలీడేస్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు నెలల పాటు వాళ్ల చేసే ఎంజాయ్ అంతా ఇంతా కాదు. కొందరు బామ్మ, తాత ఇంటికి వెళ్లితే, మరికొంత టూర్లు వేస్తుంటారు. ఇంకొంతమంది ఇష్టమైన ఆటలు ఆడుతూ ఏడాదికి సరిపడా మెమొరీస్ ను సొంతం చేసుకుంటారు. వీటి కోసం ఏడదంతా వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా వారి హాలీడేస్ ను మింగేసింది. లాక్ డౌన్ కారణంగా ఇళ్లు వదిలి ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. హాలీడేస్ పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని పిల్లలు నిరాశతో ఉన్నారు. ఈ సారి మా హాలీడేస్ ను మిస్సవుతున్నామని ఢిల్లీ కి చెందిన శితన్షూ అనే 8 ఏళ్ల చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది. “సమ్మర్ లో ఢిల్లీ నుంచి గ్వాలియర్ కు రైళ్లే వెళ్తుంటాం. ప్రయాణంతో పాటు మా బంధవుల ఇంట్లో సంతోషంగా గడుపుతాం. ఈ ఏడాది అవన్నీ మిస్సయ్యం” అని తెలిపింది. దేశ వ్యాప్తంగా చాలా మంది పిల్లలు ట్రైన్ జర్నీలు, కజిన్స్, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసే అవకాశం లేకుండా పోయిందని చైల్ట్ సైకాలజిస్ట్ రబియా హసన్ చెప్పారు. ” సమ్మర్ లో రైలు ప్రయాణం, ఇతర ప్లేస్ లలో తినే ఫుడ్, ప్రదేశాలు వారికి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ప్రస్తుతం ఇంట్లో ఉంటూ వీడియో గేమ్స్ ఆడుతున్నప్పటికీ ఈ రెండు విషయాలకు చాలా తేడా ఉంటుంది. పిల్లలు హాలీడేస్ ను మిస్సైనట్లుగా భావించకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి” అని రబియా హసన్ అన్నారు. వాస్తవానికి సమ్మర్ లో రైల్వే బుకింగ్ దొరకటమే చాలా కష్టం. రోజుకు 2 లక్షల బుకింగ్స్ ఉంటాయి. కరోనా భయంతో ఈ సారి ప్రయాణాలకు ఎవరు ఆసక్తి చూపటం లేదు. దీంతో గతంలో ఎప్పడూ లేని విధంగా మే 26 న 77000, మే 28 న 73180 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. కరోనా ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుందో అర్థం కావటం లేదని అందుకే ఏడాది ప్రయాణాలు వాయిదా వేసుకున్నామని సిమ్లాకు చెందిన ఓ చిన్నారి పేరెంట్స్ తెలిపారు.

Latest Updates