సమ్మర్ ఎఫెక్ట్: స్కూళ్లకు మరో 11రోజుల సెలవులు

ఎండాకాలం సెలవులను మరో 11రోజులపాటు పొడిగించింది సర్కార్. ఎండల తీవ్రత భారీగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. విద్యాసంస్థలకు ఇచ్చిన సెలవులను జూన్ 11వరకు పొడిగించాలని ఆదేశించారు. దాంతో.. స్కూల్ సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. అయితే.. జూన్ ఫస్ట్ కే స్కూల్స్ రీ ఓపెన్ కావాల్సి ఉంది. మరో 11 రోజులు సెలవులు పొడిగించడంతో.. జూన్ 12న స్కూల్ తిరిగి ప్రారంభం కానున్నాయి.

Latest Updates