ఎండలు దంచుడే వడగాలులూ ఎక్కువైతయ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో ఈసారి కూడా ఎండలు దంచికొట్టనున్నాయి. వడగాడ్పులు తీవ్రంగా వీయనున్నాయి. ఈ ఎండాకాలంలోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదు కానున్నాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది అత్యధికంగా రామగుండంలో 47. 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ సారి కూడా టెంపరేచర్లు ఆ స్థాయిలోనే ఉండవచ్చని చెప్తున్నారు. ఈ సమ్మర్ లో ఎక్కువ రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకు సంకేతంగా ఫిబ్రవరి మూడో వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని చోట్ల36 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. చాలాచోట్ల నార్మల్ కంటే ఎక్కువగానే టెంపరేచర్లు నమోదవుతున్నాయి.

ఉత్తర, తూర్పు జిల్లాల్లోనే..

వేసవిలో ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జగిత్యాల, కుమ్రంభీం, భద్రాచలం, ఖమ్మం, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సత్తుపల్లి వంటి చోట్ల ఎండలు మండిపోతాయని చెప్తోంది. ఈ ప్రాంతాల్లో వడగాడ్పులు కూడా ఎక్కువగానే వీచే అవకాశం ఉందని పేర్కొంటోంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గరిష్టంగా  44– 45 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఉంది. కాంక్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్చర్స్, కాలుష్యం పెరుగుతుండడం వల్ల ఎండల ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. నగర విస్తీర్ణం పెరుగుదల, వాహనాలు, ఇతర కాలుష్యం కారణంగా గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ పై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.

ఆ 2 నెలలు దంచికొడ్తయ్..

ఫిబ్రవరి చివర, మార్చి తొలి వారంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. కానీ అప్పుడే భానుడు మండిపోతున్నాడు. దీంతో ఏప్రిల్, మే నెలల్లో పగటిపూట భయంకరమైన ఎండలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 47 డిగ్రీల వరకు టెంపరేచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం, తగ్గడం గాలిలో తేమ, దిశపై ఆధారపడి ఉండనుంది.

అప్పుడే భగభగ..

ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిబ్రవరి రెండోవారంలోనే ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బయటకు వెళ్తున్నవారు ముఖాలకు టవళ్లు, మహిళలైతే స్కార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కట్టుకుంటున్నారు. మంగళవారం మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 36.3 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. మిగతా చోట్ల 34, 33 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కుమ్రంభీం జిల్లాలో అత్యల్పంగా గిన్నెదారి, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇదే జిల్లాలోని సిర్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(యు)లో 8.5, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జిల్లాలోని బేల, అర్లి (టి), లోకరిలలో 8.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చెడుపు వానలతోనే ఊరట.. 

మార్చి, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మే నెలల్లో ఎండలు తీవ్రరూపం దాల్చే క్రమంలో చెడుపు వానలు ఉపశమనం కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ వానలు ఏటా మార్చి చివరివారంలో ప్రారంభమై ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మే మొదటివారం వరకు వస్తాయంటున్నారు.  క్యుములోనింబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేఘాలు ఏర్పడి, తీవ్రమైన గాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయంటున్నారు.

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌        ఉష్ణోగ్రత     సంవత్సరం

ఖమ్మం        47.6          1966

భద్రాచలం      48.6          1973

రామగుండం   47.3          1984

హన్మకొండ    47.8          2003

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  47.3          2005

రామగుండం   47.2          2019

 

ఈసారీ 47 డిగ్రీలు దాటుతయ్ 

ఇప్పటి వరకు తెలంగాణలో ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైం రికార్డు 48.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో (1973లో) రికార్డయ్యింది. గతేడాది రామగుండంలో 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి కూడా వేడి ఇట్లనే ఉంటది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఎండలు, వడగాడ్పులు ఉంటాయి. వేసవి వాతావరణంపై ఈ నెలాఖరున ఢిల్లీ హెడ్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుంచి బులెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌విడుదల అవుతుంది.

– రాజారావు,
   వాతావరణ శాఖ అధికారి, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Latest Updates