రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు అత్యధికంగా రికార్డ్ అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గురువారం అత్యధికంగా నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ 32 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం కాస్త డిఫరెంట్ వాతావరణం నెలకొంది. రాత్రి సమయాల్లో వెదర్ చల్లగా మారుతోంది. మధ్యాహ్నం టైంలో ఎండ…మాడు పగలకొడుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గరిష్టంగా 35 డిగ్రీలు నమోదు కాగా….కనిష్టంగా 21 డిగ్రీలు రికార్డ్ అవుతున్నాయి. మరో వారం రోజులు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Latest Updates