తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు

తెలంగాణ హైకోర్టు సహా మిగిలిన కోర్టులకు వేసవి సెలవులు రద్దయ్యాయి. దీనికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా కోర్టు కార్యకలాపాలన్నీ ఆగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.హైకోర్టు, జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లకు సమ్మర్ సెలవులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో చెప్పింది. అంతేకాదు యాచకులు, వలస కూలీలను షెల్టర్ హోమ్స్ కు తరలించడంపై ప్రభుత్వం తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు.

Latest Updates