మండే ఎండలు : మీ వాహనాలపై ఓ లుక్కేయండి

మండుతున్న ఎండలకు వాహనదారులు వారి బండ్లపై కాస్త జాగ్రత్త వహించండి. లేదంటే వేడికి వాహనాలు పేలే అవకాశం ఉంది. ఇటీవల ఎండవేడికి హైదరాబాద్ లకిడికాపూల్ దగ్గర ఓ బైక్ కాలిబూడిదయిన విషయం తెలిసిందే.వాహనాల్లో పెట్రోల్, డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించకూడదు. వేడికి బండ్లు కాలిపోతున్నాయ్.

ఎండాకాలం వాహనాదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఎండాకాలంలో ఎప్పుడూ కూడా ఫుల్ ట్యాంక్ పెట్రోల్, డీజిల్ కొట్టించకూడదు.. దీని వల్ల వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి.. సగం ట్యాంక్ వరకూ పెట్రోల్ కొట్టిస్తే పర్లేదు.  కార్లు, బైక్స్ ఎండలో పార్క్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు పెట్రోల్‌, డీజిల్‌‌కి ఉండే మండే శక్తితో ఏకమై దగ్ధమయ్యే అవకాశముంది.

ఎక్కువ అసవరం అయితే తప్ప ఎండల్లో వాహనాలు నడపకూడదు.. దీనివల్ల వాహనాలకే కాదు.. ఆ ప్రభావం మన శరీరంపై కూడా పడుతుంది. తప్పనిసరి వాహనాలపై ప్రయాణించాల్సి వస్తే.. మధ్యమధ్యలో కాస్తా విరామం ఇచ్చి నడపడం మంచిది.* వెహికల్ డ్రైవింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇంజిన్ నుంచి ఎక్కువగా శబ్ధాలు వస్తుంటాయి. వీటిని ఎంతమాత్రం చులకనగా చూడొద్దు. తప్పనిసరిగా మెకానిక్‌కి చూపించాలి.

ఎండాకాలం పూర్తయ్యేవరకూ ప్రతి 15 రోజులకోసారి వాహనాలను మెకానిక్‌ దగ్గరికి తీసుకెళ్ళాలి.
చాలామంది పెట్రోల్ బంక్‌ల వద్ద మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతుంటారు. అలా చేయడం చాలా డేంజర్ వాటినుంచి వచ్చే రేడియేషన్ వల్ల వాహనాలు దగ్ధమయ్యే అవకాశాలు ఎక్కువ.

Latest Updates