యాంటీ వైర‌ల్ డ్ర‌గ్ ను విడుద‌ల చేసిన స‌న్ ఫార్మా..ఒక్కో ట్యాబ్లెట్ ధ‌ర ఎంతంటే

ప్ర‌ముఖ ఫార్మా స్యూటిక‌ల్ సంస్థ స‌న్ ఫార్మా క‌రోనా వైర‌స్ యాంటీ వైరల్‌ డ్రగ్‌ ఫావిపిరవిర్‌ను మార్కెట్ లో విడుద‌ల చేసింది.
తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా బాధితుల చికిత్సకు ఫ్లూగార్డ్‌ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ట్యాబ్లెట్ ను వినియోగించుకోవ‌చ్చ‌ని ఆ సంస్థ బిజినెస్ ఇండియా సీఈఓ కీర్తి గానోర్కర్ తెలిపారు. 200 మిల్లీగ్రాములున్న ఒక్కో టాబ్లెట్ ధ‌ర రూ.35 ప్ర‌క‌టించారు.
ఈ సంద‌ర్భంగా కీర్తి గానోర్క‌ర్ మాట్లాడుతూ దేశంలో ప్ర‌తీ రోజు 50వేల క‌రోనా కేసులు న‌మోదవుతున్నాయ‌ని, వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో త‌మ వంతు పాత్ర పోషించేందుకు ఈ టాబ్లెట్ ను అందుబాటులోకి తెచ్చార‌న్నారు. ప్ర‌జ‌ల‌పై ఆర్ధిక భారాన్ని త‌గ్గిస్తూ మరింత మంది రోగులకు ఈ ట్యాబ్లెట్ అందేలా త‌క్కువ ధ‌ర నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా రోగులకు ఫ్లూగార్డ్ ట్యాబ్లెట్ల‌ను అందించేందుకు త‌మ సంస్థ కేంద్రం, మెడిక‌ల్ క‌మ్యూనిటీతో క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్లు స‌న్ ఫార్మా సీఈఓ కీర్తి గానోర్కర్ వెల్ల‌డించారు

Latest Updates