సూర్య నారాయణ స్వామిని తాకిన సూర్య కిరణాలు

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకాయి.ఇవాళ(సోమవారం) ఉదయం 6.21 గంటల నుంచి 6.30 గంటల వరకూ తొమ్మిది నిమిషాల పాటు స్వామివారిపై సూర్య కిరణాల ప్రసారం భక్తులను కనువిందు చేసింది. ప్రతీ ఏడాది మార్చి 9, 10 తేదీల్లో సూర్య కిరణాలు స్వామివారిపై నేరుగా పడతాయి. ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు నిన్న(ఆదివారం) రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో భాగంగా ఇది జరుగుతుంది. మళ్లీ ఈ అద్భుతం అక్టోబర్ 1, 2 తేదీల్లో జరుగుతుంది.

Latest Updates