9 రోజులు దీక్ష చేసి ప్రియుడితో తాళి కట్టించుకున్న సునంద

భీమదేవరపల్లి, వెలుగు: ప్రేమించిన వాడి చేతిలో మోసపోయానని, తనను పెళ్లి చేసుకోవాలని  తొమ్మిదిరోజులుగా ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష చేసిన సునంద ఎట్టకేలకు విజయం సాధించింది. శనివారం ప్రియుడితో కులాంతర వివాహం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చంటయ్యపల్లి గ్రామానికి చెందిన ఆర్బీ జవాన్ కొన్నె రమేశ్, రూరల్ జిల్లా వర్దన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సంఖినేని సునంద ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రమేశ్ ​వేరే అమ్మాయితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడని తెల్సుకున్న సునంద ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది. తొమ్మిది రోజుల చర్చల అనంతరం ఇరువురికి పెద్దలు పెండ్లి చేశారు.

for more News..

కరోనా లాక్‌డౌన్‌ టైమ్​ కుటుంబాలకు మేలే చేసింది

హైదరాబాద్‌లో చెట్టు కొట్టేసినందుకు రూ. 10 వేల ఫైన్

ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌‌ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్

Latest Updates