ఇండియాలో రూ.75 వేల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేయనున్న గూగుల్

న్యూఢిల్లీ: విదేశాల్లో కంపెనీని విస్తరించడంలో భాగంగా వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో ఇండియాలో 75 వేల కోట్ల (సుమారుగా 10 బిలియన్ డాలర్లు)ను ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ తెలిపింది. ఇండియన్ డిజిటల్ ఎకానమీని పెంపొందించడంతోపాటు దేశాన్ని డిజిటలైజేషన్‌లో ముందుకు తీసుకెళ్లడానికి ఇది దోహదపడుతుందని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఓ ప్రకటనలో చెప్పారు.

‘ఈ మిషన్ పూర్తిగా నా వ్యక్తిగతానికి సంబంధించినది. పెరుగుతున్న టెక్నాలజీ ఓ కుటుంబంగా మమ్మల్ని మరింత దగ్గర చేసింది. పార్ట్‌నర్‌‌షిప్స్‌, ఆపరేషనల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌, ఎకో సిస్టమ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కలుపుతూ ఈక్విటీ ఎక్విప్‌మెంట్స్‌ను ముందుకు తీసుకెళ్తాం. ఇండియా మీద దాని డిజిటల్ ఎకానమీ పై మాకున్న నమ్మకానికి ఇది నిదర్శనం. డిజిటల్ ఇండియా కోసం కలలు కంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి సహకరించడానికి మేం గర్వంగా భావిస్తున్నాం. మాకు సహకరించినందుకు మంత్రులు రవి శంకర్ ప్రసాద్, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్‌కు కృతజ్ఞతలు’ అని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.

Latest Updates