విరాట్ కోహ్లీ ‌– అనుష్క వివాదం : అయ్యో నేను అంత మాటనలేదు

విరాట్ కోహ్లీ ‌– అనుష్కకు విరుద్దంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు సునీల్ గవాస్కర్. రాజస్తాన్ రాయల్స్ ‌‌– కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ ఓడిపోయింది. జట్టుఓటమిలో కోహ్లీ వైఫల్యమేనంటూ సునీల్ గవాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాఖ్యలపై అనుష్క ఘాటుగా స్పందించారు. తన భర్త ఆడే గేమ్ లో తనని ఎందుకు లాగుతున్నారంటూ మండిపడ్డారు. గవాస్కర్ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై సునీల్ గవాస్కర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కోహ్లీ‌‌– అనుష్కల గురించి తాను తప్పుగా మాట్లాడలేదని,తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అన్నారు.

ఈ వివాదంలో నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు. చాలాసార్లు కోహ్లీ సెంచరీ చేసినప్పుడలా అనుష్క శర్మకు క్రెడిట్ ఇవ్వరు ..అలా అనుష్కకు క్రెడిట్ ఎందుకు ఇవ్వరని కోహ్లీని ప్రశ్నించిన ఏకైక వ్యక్తిని తానేని గవాస్కర్ అన్నారు.

మహిళలకు తాను అనుకూలంగా ఉంటానని, ఆటగాళ్ళ పర్యటనలకు వారి భార్యల్ని అనుమతించేందుకు ఇష్టపడతానని చెప్పారు. ఎందుకంటే అందరిలాగే క్రికెట్ కూడా మాకు ఒక వృత్తేనన్నారు.

నా మాటలకు అర్ధం ఏంటంటే లాక్డౌన్ సమయంలో ఆటగాళ్ళు ఎవరూ సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదని , అందుకు ఊదాహరణగా లాక్ డౌన్ కారణంగా కోహ్లీ – అనుష్క శర్మతో టెన్నీస్ బాల్ తో క్రికెట్ ఆడుతున్న వీడియోలే నిదర్శనమన్నారు.

రోహిత్ తన మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ సరిగా చేయలేదు. రోహిత్ తో పాటు ఎంఎస్ ధోని, విరాట్ బ్యాటింగ్ సరిగా చేయలేకపోయారు. దానికి కారణం సరైన ప్రాక్టీస్ లేకపోవడమేని గవాస్కర్ చెప్పారు.

నా కామెంట్రీలో ఎక్కడా అనుష్క గురించి తప్పుగా మాట్లాడలేదు. ఎవరో నా వాఖ్యల్ని వక్రీకరించారని ఈ ఇండియన్ మాజీ క్రికెటర్, ఐపీఎల్ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ చెప్పే ప్రయత్నం చేశారు.

Latest Updates