ధోని ఆడకుండా అలా ఎలా ఉంటున్నాడు.?

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌‌ ఎంఎస్‌‌ ధోనీ లాంగ్‌‌ బ్రేక్‌‌పై లెజెండరీ క్రికెటర్‌‌ సునీల్‌‌ గావస్కర్‌‌ పెదవి విరిచాడు. ఇండియాకు ఆడకుండా ఓ వ్యక్తి అంతకాలం ఎలా ఉండగలుగుతున్నాడని ప్రశ్నించాడు. వరల్డ్‌‌కప్‌‌ సెమీఫైనల్‌‌లో ఇండియా ఓటమి పాలైనప్పటీ నుంచి ధోనీ ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌లో ధోనీ ఆడడంపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్‌‌ను ప్రశ్నించగా..  ‘అంతా ఫిట్‌‌నెస్‌‌పైనే ఆధారపడి ఉంటుంది. అది  ధోనీ తనని తాను ప్రశ్నించుకోవాల్సిన విషయం. గతేడాది జులై 10 నుంచి అతను ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఓ వ్యక్తి ఇండియాకు ఆడకుండా అంతకాలం ఎలా ఉండగలుతున్నాడనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. దీనికి బదులు దొరికితే అందులో అన్నింటికీ తగిన సమాధానం ఉంటుందని’ అన్నాడు. అంతేకాక డొమెస్టిక్‌‌ క్రికెటర్ల మ్యాచ్‌‌ ఫీజులు పెంచనంత కాలం ఐపీఎల్‌‌ ముందు రంజీ ట్రోఫీ అనాథ లాగా దూరపు బంధువులా మిగిలిపోతుందని గావస్కర్‌‌ అభిప్రాయపడ్డాడు.

Latest Updates