ధోనీ రీఎంట్రీ అసాధ్యం

న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో మహేంద్ర సింగ్‌ ధోనీ టీమిండియాలోకి తిరిగి రావడం దాదాపు అసాధ్యమేనని మాజీ కెప్టెన్‌ సునీల్‌
గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. MS ధోనీ రీఎంట్రీ అంశంపై గావస్కర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. టీ20 వరల్డ్‌‌‌‌కప్‌ ఆడే ఇండియా
జట్టులో ధోనీని ఉండాలని కోరుకుంటున్నాను కానీ.. అది జరిగేలా లేదని గావస్కర్‌ అన్నాడు. టీమ్‌ ఎప్పుడో ముందడగు వేసిందని, హడావుడికి ఇష్టపడని ధోనీ నెమ్మదిగా ఆటకు దూరమవుతాడని భావిస్తున్నానని సునీల్‌ చెప్పాడు. 2019 వన్డే వరల్డ్‌‌‌‌కప్‌ తర్వాత నుంచి ధోనీ ఆటకు దూరంగా ఉన్నా డు. ఐపీఎల్‌ తో రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఇందుకోసం తమ టీమ్‌ సీఎస్‌‌‌‌కేతో కలిసి ప్రిపరేషన్స్‌ కూడా మొదలుపెట్టాడు. కొవిడ్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో లీగ్‌ వాయిదా పడడంతో మహీ రీ ఎంట్రీ కోసం ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్‌కు నిరాశ మిగిలింది.

Latest Updates