కోహ్లీ.. అనుష్క బౌలింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేసినట్లున్నాడు

తన ఆటతో, కామెంట్రీతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఇండియన్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సహనం కోల్పోయి.. రాయల్ ఛాలెంజర్స్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నాసిరకంగా ఫీల్డింగ్ చేశాడు. బ్యాక్ అండ్ బ్యాక్ క్యాచ్‌లను వదిలేశాడు. దీంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ భారీ స్కోరును సాధించింది.

అయితే ఫీల్డింగ్ లో విఫలమైన కోహ్లీ బ్యాటింగ్ తో జట్టును గెలిపిస్తారని అభిమానులు ఆశించారు. కానీ కోహ్లీ మాత్రం సింపుల్ అవుట్ అయ్యాడు. 5బంతులు మాత్రమే ఆడిన విరాట.. షెల్డన్ కాట్రెల్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అప్పటికి జట్టు స్కోరు నాలుగు పరుగులే. దీంతో భారీ లక్ష్యం ముందున్నా.. ఆ స్థాయిలో ఆడకపోవడంపై ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

అదే సమయంలో కామెంటీటర్ సునీల్ గవాస్కర్..విరాట్ పై మండిపడ్డారు. విరాట్ కోహ్లీ లాక్ డౌన్ సమయంలో అనుష్క బౌలింగ్‌కు ఎగెనెస్ట్ గా ఆడడం మాత్రమే నేర్చుకున్నారని అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలపై విరాట్ అభిమానులు మండితున్నారు. కామెంట్రీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా కోహ్లీపై గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై సన్నీ అభిమానులు మద్దతు పలుకుతున్నారు. లాక్ డౌన్ లో విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడని, అనుష్క బౌలింగ్ చేయగా..కోహ్లీ బ్యాటింగ్ చేశారని సమర్ధిస్తున్నారు.

Latest Updates