302 రూమ్ లో ఏం జరిగింది..?

కార్తికేయ మిరియాల డైరెక్షన్ లో భవికా దేశాయ్,  వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 302 ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్. రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ ఆదివారం రిలీజ్ కాగా.. యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది.  హైదరాబాద్‌ లో ప్రముఖ కమెడియన్‌, నటుడు సునీల్‌ ఆవిష్కరించారు. అయితే సినిమాలో శృతిమించిన సన్నివేశాలున్నట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది.

‘హలో.. రూమ్‌ నెంబర్‌. 302కి ఒక కండోమ్‌ ప్యాకెట్‌ కావాలి’ అన్న అమ్మాయి మాటలతో టీజర్‌ ప్రారంభమవుతుంది. ఇక చివర్లో అదే అమ్మాయి దయ్యంగా మారినట్లు కనిపించడంతో టీజర్‌ ముగుస్తుంది. క్రైమ్, సస్పెన్స్, కామెడీ అంశాలతో పాటు కాస్త హారర్ అంశాలను మేళవించి ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపాడు డైరెక్టర్.  ‘ఒకరోజులో అంటే.. 24 గంటల్లో జరిగే కథ’ అని తెలిపారు. ఈ సినిమాను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు  నిర్మాత అవినాష్ సుందరపల్లి తెలిపారు.

see also: 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నేత

మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడు

కళ్యాణి ప్రియదర్శినికి శక్తి ఎంటో చూపించాడు

Latest Updates