అదనంగా బస్సులు నడపాలని ఆదేశాలు

రంగారెడ్డి జిల్లా: ఆర్టీసీ డిపో మేనేజర్ లు, జిల్లా అధికార యంత్రాంగంతో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ వీడియో కాన్ఫిరెన్స్ముగిసింది.  రేపు(గురువారం) RTC కార్మికులు డిపో ల ముందు ధర్నాకు పిలుపునివ్వడంతో భద్రతా బలగాలను రంగంలోకి దింపాలని సునీల్ శర్మ ఈ కాన్ఫరెన్స్ లో ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి ప్రస్తుతం 50% బస్సులు మాత్రమే నడుస్తున్నాయని, అదనంగా బస్సులు నడపాలని ఆదేశించారు.  దసరా సెలవులు ఈ నెల 13 న ముగిసి, 14 నుంచి పాఠశాలలు రీ ఓపెన్ అవుతుండడంతో…విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. పండుగకు ఊళ్ళకు వెళ్లిన వాళ్ళు తిరిగి వస్తారు కాబట్టి వారికీ ఇబ్బందులు కాకుండా చూసుకోవాలని అధికారులను అదేశించారు.

Sunil Sharma video conference with RTC depot manager and district authority

Latest Updates