హీరో సునీల్ శెట్టికి సుడి తిరిగింది

సుడి తిరిగది కొంతమంది మొదట ఓ వెలుగు వెలుగుతారు. కాలం గడిచేకొద్దీ ఫేడవుట్ అయిపోతారు. కానీ సునీల్ శెట్టి కేసు రివర్స్ అని చెప్పొచ్చు. అప్పట్లో చాలా సినిమాలు చేశాడుసునీల్. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.సెకెండ్ ఇన్నింగ్స్‌‌లో మాత్రం మంచి మంచి అవకాశాలు సంపాదిస్తున్నాడు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగేందుకు దూసుకెళ్తున్నాడు. మలయాళంలో మోహన్‌ లాల్ హీరోగా ‘మరక్కార్’ మూవీ తీస్తున్నాడు ప్రియదర్శన్. ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు సునీల్. కన్నడ మూవీ ‘పహిల్వాన్‌ ’లో సుదీప్‌ కి గురువుగా నటించాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. మరోపక్క సూపర్‌‌‌‌ స్టార్ రజనీకాంత్‌ హీరోగా మురుగదాస్ తీస్తున్న ‘దర్బార్‌‌‌‌’లో నూ సునీల్‌‌కి చోటు దక్కింది. హిందీ లో కూడా కొన్ని మంచి అవకాశాలు చేతిలో ఉన్నాయి.  దాంతో సంతోషంతో పొంగిపోతున్నాడు. ‘నా కెరీర్ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తోంది. నేను నటించిన ‘పహిల్వాన్’ ఐదు భాషల్లో విడుదలవుతోంది. అలాగే ఆ భాష, ఈ భాష అని లేకుండా అన్నింటిలోనూ అవకాశాలు అందుకుంటున్నాను . చాలా సర్‌‌‌‌ప్రైజింగ్‌‌గాను, సంతో షంగాను ఉంది’ అంటున్నాడు ఆనందంగా. మొత్తానికి ఇన్నాళ్లకి సునీల్‌‌కి సుడి తిరిగిందన్నమాట

Latest Updates