ఆగస్టు 4న సునీత లైవ్​కాన్సర్ట్

​హైదరాబాద్, వెలుగు: ‘మెలోడియస్ మూవ్​మెంట్స్ విత్ సునీత’ పేరున ఆగస్ట్ 4న నగరంలోని శిల్ప కళావేదికలో లైవ్ ఇన్ కాన్సెర్ట్ జరగనుంది. ఎలెవన్ పాయింట్ టూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం శుక్రవారం జూబ్లీహిల్స్ లోని కెమిస్ట్రీ క్లబ్​లో జరిగింది. ప్లేబ్యాక్ సింగర్ సునీత పాల్గొని పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లైవ్ ఇన్ కాన్సెర్ట్ ద్వారా అభిమానులను, సంగీత ప్రియులను కలుసుకోబోతుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎలెవన్ పాయింట్ టూ నిర్వహణలో అమెరికాలో ‘మెలోడియస్ మూవ్​మెంట్స్ విత్ సునీత’ నిర్వహించిన లైవ్ కాన్సెర్ట్ సక్సెస్​అయ్యిందని గుర్తుచేశారు. లైవ్ కాన్సర్ట్ లో తన 25 ఏళ్ల మ్యూజిక్ జర్నీలో పాడిన అద్భుతమైన మెలోడీస్ తో పాటు హిందీ, తమిళ సాంగ్స్ పాడబోతున్నట్లు చెప్పారు. అలాగే చైన్నైకి చెందిన 13 ఏళ్ల బాలుడు పియానిస్ట్ లిడియాన్ నాధస్వరం పాల్గొంటున్నారని అన్నారు.

Latest Updates