బీజేపీలోకి నటుడు సన్నీ డియోల్

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సన్నీ డియోల్‌ ఇవాళ( మంగళవారం) బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పియుష్‌ గోయల్‌ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. పంజాబ్‌లోని  గురుదాస్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

దేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కష్టపడుతున్నారని, మరో ఐదేళ్లు ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు సన్నీ డియోల్‌. యువతకు మోడీ లాంటి నాయకులు చాలా అవసరమన్నారు. అటల్ బిహారి వాజపేయికి మద్దతు ఇచ్చి ఆయనతో కలిసి తన తండ్రి ధర్మేంద్ర పనిచేశారని, అదేవిధంగా తాను కూడా మోడీకి అండగా ఉంటానని అన్నారు. చేతల ద్వారానే రాజకీయాల్లో తానెంటో నిరూపించుకుంటానని చెప్పారు సన్నీ.

Latest Updates