త్వరలో..! ముంబైలో సన్నీలియోన్ ఆర్ట్ స్కూల్

పోర్న్ స్టార్ ముద్ర నుంచి బయటపడేందుకు ప్రయత్నించి చాలా వరకూ సక్సెస్ అయ్యింది సన్నీ లియోన్. అందుకే హిందీతో పాటు ఇతర భాషల పరిశ్రమలు కూడా ఆమెని ఆదరిస్తున్నాయి. హిందీలో ఇపుడు రెండు చిత్రాల్లో నటిస్తోంది. మలయాళంలో ఒకటి, కన్నడలో ‘వీరమహాదేవి’ చిత్రాలు చేస్తోంది. ఇదంతా ఓ పక్క. వ్యక్తిగత జీవితం మరోపక్క. సన్నీకి పిల్లలంటే చాలా ఇష్టం . అందుకే మొదట ఓ పాపని దత్తత చేసుకుంది. తర్వాత సరోగసీ ద్వారా కవలలకు తల్లయ్యింది. అటు సినిమాలు, ఇటు కుటుంబాన్ని చూసుకుంటూనే వ్యాపారంలోనూ రాణిస్తోం ది. కాస్మొటిక్స్, పర్‌‌‌‌ఫ్యూమ్ స్‌ బిజినెస్‌‌ చేస్తోంది. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఒక స్కూల్‌ ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.

సన్నీ కూతురు ఆర్ట్ స్కూల్‌ కి చాలా ఇష్టంగా వెళ్తుందట. తనని చూసినప్పుడల్లా పిల్లలకి చదువుతో పాటు ఇతర వ్యాపకాలు కూడా ఎంత అవసరం అనేది అర్థమవుతూ ఉంటుందట. అందుకే కేవలం చదువే కాకుండా ఇతర కళల్లోనూ తర్ఫీదునిచ్చేలా ముంబైలో ఒక ఆర్ట్ స్కూల్‌ ని ప్రారంభించబోతోంది సన్నీ. ఈ నిర్ణయం తీసుకోవడానికి పిల్లలపై తనకున్న ఇష్టం కూడా ఓ కారణమంటోంది. సన్నీ సామాన్యమైన మహిళ కాదు, ఒకేసారి ఇన్ని రకాల పనులు చేస్తోందంటే తను సూపర్‌‌‌‌ ఉమన్‌ అంటున్నారు బాలీవుడ్‌‌లోని కొందరు.

Latest Updates