కోల్ కతాతో మ్యాచ్.. టాస్ గెలిచిన హైదరాబాద్

అబుదాబి: ఐపీఎల్ -13 సీజన్ లో భాగంగా  అబుదాబి వేదికగా కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది హైదరాబాద్. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫీల్డిగ్ ఎంచుకున్నాడు. వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇవాళ్టి మ్యాచ్ గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ కేకేఆర్‌ ఎనిమిది మ్యాచ్‌లాడి నాలుగు విజయాలు సాధించగా, సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ ఎనిమిది మ్యాచ్‌లకు గాను మూడు విజయాలు మాత్రమే సాధించింది.

ఓవరాల్‌గా ఇరు జట్లు 18 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా కేకేఆర్‌ 11సార్లు విజయం సాధించగా, ఎస్‌ఆర్‌హెచ్‌ 7 సార్లు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో బాసిల్‌ థంపిని జట్టులోకి తీసుకున్నారు. అబ్దుల్‌ సామద్‌ తిరిగి జట్టులో చేరాడు. మరొకవైపు కేకేఆర్‌ కూడా రెండు మార్పులు చేసింది. కుల్దీప్‌ యాదవ్‌, లూకీ ఫెర్గ్యూసన్‌లు తుదిజట్టులోకి వచ్చారు. క్రిస్‌ గ్రీన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలకు రెస్ట్ ఇచ్చారు.

టీమ్స్:

 

Latest Updates