సన్‌‌‌‌రైజర్స్‌ VS ముంబై: ప్లే ఆఫ్ బెర్తే లక్ష్యం

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ కీలకదశకు చేరుకున్నవేళ సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ మరో కీలకపోరుకు సిద్ధమైంది. ఇవాళ( గురువారం) వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌‌‌‌తో పోరుకు సిద్ధమైంది. లీగ్‌‌‌‌ తొలి అంచెలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవడంతోపాటు.. ఈ మ్యాచ్‌‌‌‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌‌‌‌ వైపు ముందంజ వేయాలని ఆరెంజ్‌‌‌‌ ఆర్మీ భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌‌‌‌లో ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా ప్లే ఆఫ్‌‌‌‌ బెర్త్‌‌‌‌ ఖాయం చేసుకోవాలని రోహిత్‌‌‌‌సేన పట్టుదలగా ఉంది.

వార్నర్‌‌‌‌ స్థానంలో గప్టిల్‌‌‌‌..?

ఈ సీజన్‌‌‌‌లో ఆరెంజ్‌‌‌‌ఆర్మీ తరపున పరుగుల వరద పారించిన ఆస్ట్రేలియా ఓపెనర్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌ నుంచి ఐపీఎల్‌‌‌‌కు అందుబాటులో ఉండడం లేదు. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ సన్నాహక శిబిరం కోసం తను ఆసీస్‌‌‌‌ బయలుదేరి వెళ్లాడు. ఈక్రమంలో తన స్థానంలో న్యూజిలాండ్‌‌‌‌ విధ్వంసక ప్లేయర్‌‌‌‌ మార్టిన్‌‌‌‌ గప్టిల్‌‌‌‌ బరిలోకి దిగే అవకాశముంది. ఈ టోర్నీలో సత్తాచాటిన ఓపెనర్ల ద్వయం వార్నర్‌‌‌‌–జానీ బెయిర్‌‌‌‌స్టోలను మరపించేలా ఆరెంజ్‌‌‌‌ఆర్మీ బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ రాణిస్తేనే ఈ మ్యాచ్‌‌‌‌లో విజయం సాధించే అవకాశముంటుంది. కెప్టెన్‌‌‌‌ కేన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌తోపాటు మనీశ్‌‌‌‌ పాండే, వృద్ధిమాన్‌‌‌‌ సాహా, యూసుఫ్‌‌‌‌ పఠాన్‌‌‌‌, విజయ్‌‌‌‌ శంకర్‌‌‌‌, దీపక్‌‌‌‌ హుడా మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరముంది. బౌలింగ్‌‌‌‌లో ఆరెంజ్‌‌‌‌ ఆర్మీ దుమ్ము రేపుతోంది. రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ నబీ స్పిన్‌‌‌‌ విభాగంలో, భువనేశ్వర్‌‌‌‌ కుమార్‌‌‌‌, సందీప్‌‌‌‌ శర్మ, ఖలీల్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ పేసర్లుగా ఆకట్టుకుంటున్నారు. ఈ మ్యాచ్‌‌‌‌లో నెగ్గితే 14 పాయింట్లతో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ ప్లే ఆఫ్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. రన్‌‌‌‌రేట్‌‌‌‌ బాగున్నందునా చివరిమ్యాచ్‌‌‌‌లో ఓడిపోయినా 14 పాయింట్లతో ఆరెంజ్‌‌‌‌ ఆర్మీకి నాకౌట్‌‌‌‌ అవకాశాలుంటాయి.  ఈ నేపథ్యంలో మ్యాచ్‌‌‌‌లో విజయం సాధించడం కోసం విలియమ్సన్‌‌‌‌సేన సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతోంది.

గెలుపు బాట పట్టాలని..

ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నానుడికి ముంబై ఇండియన్స్‌‌‌‌ అతీతంలా కొనసాగుతోంది. ఇప్పటివరకు ముంబై గెలిచిన ఏడు మ్యాచ్‌‌‌‌ల్లో నాల్గింటిలో ప్రత్యర్థి వేదికలపై నెగ్గగా.. మిగతా మూడు సొంతగడ్డపై వచ్చినవే. ఈ నేపథ్యంలో చివరగా జరిగే రెండు హోమ్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌మ్యాచ్‌‌‌‌ల్లో నెగ్గి లెక్క సరిచేసుకోవడంతో పాటు ప్లే ఆఫ్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను ఖరారు చేసుకునేలా వ్యూహాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో ఆరెంజ్‌‌‌‌ ఆర్మీని మట్టి కరిపించాలని భావిస్తోంది. ముంబై బ్యాటింగ్‌‌‌‌ విభాగంలో టాపార్డర్‌‌‌‌ సత్తాచాటుతోంది. కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ, క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌, ఎవిన్‌‌‌‌ లూయిస్‌‌‌‌ ఆకట్టుకుంటున్నారు. మరోవైపు సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌, కీరన్‌‌‌‌ పోలార్డర్‌‌‌‌ ఒకటి అరా ఇన్నింగ్స్‌‌‌‌ల్లో తప్ప తమ ప్రతాపం చూపించలేదు. పాండ్యా సోదరుల్లో హార్దిక్‌‌‌‌ దూసుకుపోతుండగా.. క్రునాల్‌‌‌‌ అంతంతమాత్రంగానే రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్‌‌‌‌ విభాగంలో ఆసీస్‌‌‌‌ పేసర్‌‌‌‌ జాసన్‌‌‌‌ బెరెన్‌‌‌‌డార్ఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ సన్నాహకం కోసం స్వదేశానికి పయనవడం ఎదురుదెబ్బే. మిగతా పేసర్లలో జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా, లసిత్‌‌‌‌ మలింగ ఫర్వాలేదనిపిస్తున్నారు. స్పిన్లర్లలో రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. గత మ్యాచ్‌‌‌‌లో కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ చేతిలో ఓడిన ముంబై.. ఈ మ్యాచ్‌‌‌‌లో సమష్టిగా రాణించి గెలుపుబాట పట్టాలని కృతనిశ్చయంతో ఉంది.

జట్లు (అంచనా):

సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌: విలియమ్సన్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), గప్టిల్‌‌‌‌, సాహా, మనీశ్‌‌‌‌, యూసుఫ్‌‌‌‌, హుడా, శంకర్‌‌‌‌, రషీద్‌‌‌‌, నబీ, భువనేశ్వర్‌‌‌‌, ఖలీల్‌‌‌‌.

ముంబై ఇండియన్స్: రోహిత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), డికాక్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌, లూయిస్‌‌‌‌, పొలార్డ్‌‌‌‌, హార్దిక్‌‌‌‌, క్రునాల్‌‌‌‌, బుమ్రా, మలింగ, చహర్‌‌‌‌, శ్రాన్‌‌‌‌.

Latest Updates