బెంగళూరు చిత్తు : సన్ రైజర్స్ భారీ విక్టరీ

ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను చిత్తుచిత్తుగా ఓడించింది హైదరాబాద్ సన్ రైజర్స్. 232 భారీ టార్గెట్ ను చూడగానే బెంగళూరు గుండె జారిపోయినట్టుంది. ఆటగాళ్లు కనీసం పోరాడకుండానే చేతులెత్తేశారు. సైకిల్ స్టాండ్ లాగా.. ఒకరితర్వాత ఒకరు పెవీలియన్ కు క్యూ కట్టారు. 113 రన్స్ కే మరో బాల్ మిగిలి ఉండగానే ఆలౌట్ అయ్యింది. బెంగళూరు. 118 రన్స్ తో భారీ విజయం నమోదు చేసింది లోకల్ టీమ్ సన్ రైజర్స్.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 231 రన్స్ భారీ స్కోరు చేసింది. బెయిర్ స్టో(56 బాల్స్ లో 114, 12 ఫోర్లు, 7 సిక్సులు) డేవిడ్ వార్నర్ (55 బాల్స్ లో 100 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సులు) మెరుపు వేగంతో అద్భుత సెంచరీలు చేయడంతో సన్ రైజర్స్ బిగ్ టార్గెట్ ను పెట్టగలిగింది. తొలి వికెట్ కు వీరిద్దరూ 185 రన్స్ జోడించి ఐపీఎల్ రికార్డ్ ను క్రియేట్ చేశారు.

తర్వాత బెంగళూరు మొదటినుంచే నీరసంగా ఆడింది. ఓటమి ఖాయమైన మ్యాచ్ లో కనీసం పోరాడలేకపోయింది. టాప్, మిడిలార్డర్ ను మహ్మద్ నబీ కుప్పకూల్చాడు. కీలకమైన విరాట్ కోహ్లీ(3) వికెట్ ను సందీప్ శర్మ పడగొట్టాడు. గ్రాండ్ హోమ్(37) ఒక్కడే రాణించాడు. నబీ 4, సందీప్ శర్మ 3 వికెట్లు కూల్చారు. ఫీల్డర్లు చురుగ్గా స్పందించి 3 రనౌట్లు చేశారు.

 

Latest Updates