హ్యాట్రిక్ గెలుపుపై సన్ రైజర్స్ గురి

న్యూఢిల్లీ: వరుసగా రెండు విజయాలు సాధించి జోరుమీదున్న గతేడాది రన్నరప్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌ లో విజయం సాధించి సత్తాచాటాలన్న కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు గత మ్యాచ్‌లో అనూహ్య ఓటమితో డీలాపడిన ఢిల్లీ.. ఈమ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ గెలుపుబాట పట్టాలని భావిస్తోంది.

దుమ్ము రేపుతున్న ఆరెంజ్ఆర్మీ

ఈ సీజన్‌ లో ఇప్పటివరకు చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ తర్వాత అత్యంత విజయవంతమైన జట్టేదంటే సన్‌ రైజర్స్‌ హైదారాబాదేనని చెప్పుకోవచ్చు. గతేడాది పటిష్టమైన బౌలింగ్‌‌తో అలరించిన ఆరెంజ్‌ ఆర్మీ… డేవిడ్‌ వార్నర్‌‌, బెయిర్‌‌స్టోలాంటి ఆటగాళ్ల రాకతో బ్యాటింగ్‌‌లోనూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఓపెనింగ్‌‌ ద్వయం వార్నర్‌‌–బెయిర్‌‌స్టో ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. గడిచిన మూడు మ్యాచ్‌ల్లోనూ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి సత్తాచాటారు. ముఖ్యం గా రాయల్‌‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ లో వీరిద్దరూ చెలరేగి సెంచరీలు సాధించడం విశేషం. ఆరంభంలో పటిష్టమైన భాగస్వామ్యాలతో వీరిద్దరూ సత్తాచాటుతుంటే అనంతరం కేన్‌ విలియమ్సన్‌ , యూసుఫ్‌ పఠాన్‌ ,విజయ్‌ శంకర్‌‌, మనీశ్ పాండే లాంటి హిట్టర్లతో జట్టు బ్యాటింగ్‌‌ లైనప్‌ పటిష్టంగా కన్పిస్తోంది. గత మూడు మ్యాచ్‌ ల్లో ఓపెనర్ల అండగా నిలవడంతో మిడిలార్డర్‌‌ అంతగా ఫోకస్‌ కాలేదు. మున్ముందు మ్యాచ్‌ ల్లో ఎలా అడతారో చూడాలి. ఇక బౌలింగ్‌‌ విభాగంలో ఆఫ్గనిస్తాన్‌ ఆల్‌‌రౌండర్లు సత్తాచాటుతున్నారు. రషీద్‌ ఖాన్‌ తొలి మ్యాచ్‌ నుంచి ఆడుతుండగా.. గత మ్యాచ్‌ లో చోటు దక్కించుకున్న మహ్మద్‌ నబీ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.పేసర్లలో సందీప్‌ శర్మ ఆకట్టుకుం టున్నాడు. ప్రధాన బౌలర్‌‌ భువనేశ్వర్‌‌ కుమార్‌‌ స్థా యికి తగ్గట్లు ప్రదర్శన చేయడం లేదు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ లాడిన సన్‌ .. రెండు విజయాలతో పట్టికలో రెండోస్థానంలో కొనసాగుతోంది.

ఢిల్లీకి మిడిల్ఆర్డర్బెంగ

ఛేజింగ్‌‌లో బోల్తాపడడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు అలవాటుగా మారింది. కోల్‌‌కతా నైట్‌ రైడర్స్‌తో చివరి ఓవర్లో 6 పరుగులు చేయడం చేతకాక సూపర్‌‌ ఓవర్‌‌లో కగిసో రబాడ బౌలింగ్‌‌తో గట్టెక్కింది. ఇక చివరిగా కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్‌ లో కేవలం ఎనిమిది పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లను చేజార్చుకుని ఓటమిని కొనితెచ్చుకుంది. ఈ రెండు మ్యాచ్‌ ల్లో టాపార్డర్‌‌ రాణించిన మిడిల్‌‌, లోయర్‌‌ ఆర్డర్‌‌ చేతులెత్తే యడంతో ఢిల్లీకి కష్టాలు ఎదురయ్యాయి. సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ ఈ లోపాన్ని సవరించుకోవాల్సి ఉంది. కీలకమైన మ్యాచ్‌ ల్లో ఇలా చెత్త ఆటతీరుతో ఓడిపోవడంపై కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇక తురుపుముక్క రిషబ్‌ పంత్‌ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. శిఖర్‌‌ ధవన్‌ ,పృథ్వీ షా, కొలిన్‌ ఇంగ్రామ్‌ ఫర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్‌‌లో రబాడ, లామిచానే ఆకట్టుకుంటున్నారు. ఇషాంత్‌ శర్మ, ట్రెంట్‌ బౌల్ట్‌‌ గత మ్యాచ్‌ ల్లో బెంచ్‌ కే పరిమితమయ్యారు. సొంతగడ్డపై గురువారం జరిగే మ్యాచ్‌ లో ఢిల్లీ ఎలాంటి ప్రణాళికలు వేస్తుందో చూడాలి.

జట్లు (అంచనా)

సన్రైజర్స్హైదరాబాద్ : వార్నర్‌‌, బెయిర్‌‌స్టో ,విలియమ్సన్‌ (కెప్టెన్‌ ), పాండే, విజయ్‌ శంకర్‌‌,దీపక్‌ హుడా, యూసుఫ్‌ , రషీద్‌ , భువనేశ్వర్‌‌,సందీప్‌ , కౌల్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ : పృథ్వీ షా, ధవన్‌ , శ్రేయస్‌ (కెప్టెన్‌ ), ఇంగ్రామ్‌ , పంత్‌ , విహారి, మోరిస్‌ , లామిచానే, అవేశ్‌‌ ఖాన్‌ , హర్షల్‌‌ పటేల్‌‌, రబాడ

Latest Updates