వడదెబ్బ తగిలి యువకుడు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. జైనథ్ మండలం నిరాల గ్రామానికి చెందిన రాహుల్.. 3 రోజులు ఎండలకు పొలంలో పనిచేశాడు. వడదెబ్బ తగలడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రిమ్స్ లో చికిత్స పొందుతూ రాహుల్ చనిపోయాడు. దీంతో.. అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 3 రోజులుగా.. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరుసగా 45 డిగ్రీల పైనే ఎండలు దంచుతున్నాయి. దీంతో.. ఎవరూ బయటతిరగొద్దని వాతావరణశాఖ అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే.. ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

Latest Updates