వడదెబ్బతో గుర్తుతెలియని వ్యక్తి మృతి

శంషాబాద్, వెలుగు: కూర్చున్న  చోటనే వ్యక్తి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడ వెళ్లే రోడ్డు పక్కన లక్కీ బేకరీ వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఎండదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి   (40 ) కూర్చున్న చోట అలాగే పడిపోయి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం ఉస్మానియా హాస్పిటల్‌ కు తరలించారు. కేసు నమోదు చేశామని అతని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Latest Updates