బీహార్ అమ్మాయి జ్యోతికి ఫ్రీగా ఐఐటీ జేఈఈ కోచింగ్

సూపర్ 30 ఫౌండర్ ఆనంద్ కుమార్ ఆఫర్

పాట్నా : ఆరోగ్యం సరిగా లేని తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన బీహర్ అమ్మాయి జ్యోతికి సూపర్ 30 ఫౌండర్ ఆనంద్ కుమార్ ఫ్రీ ఐఐటీ జేఈఈ కోచింగ్ ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. తన ఇన్ స్టిట్యూట్ లో ఆమెకు ఐఐటీ కోచింగ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని చెప్పారు. దీనికి సంబంధించి జ్యోతి కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ఆనంద్ కుమార్ బ్రదర్ వారితో మాట్లాడారు. సైక్లింగ్ లో కోచింగ్ ఇస్తామని సైక్లింగ్ ఫెడరేషన్ ప్రకటించినప్పటికీ ఫస్ట్ ప్రయారిటీ చదువేనని జ్యోతి చెప్పారు. ‘‘స్డడీస్ పై ఆమెకు ఉన్న ఇంట్రెస్ట్ చూసి మా ఇన్ స్టిట్యూట్ లో చేర్చుకోవాలనుకుంటున్నాం” అని ఆనంద్ కుమార్ చెప్పారు. లాక్ డౌన్ వల్ల బస్సులు,రైళ్లు అందుబాటులో లేకపోవటంతో నోయిడా నుంచి బీహర్ లోని దర్భంగా వరకు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఆమె తండ్రిని ఇంటికి చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న అమెరికా ప్రెసిడెంట్ బిడ్డ ఇవాంకా ట్రంప్ సైతం జ్యోతిని మెచ్చుకున్నారు. అమెరికా రావాలంటూ ఆహ్వానించారు. బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి కూడా జ్యోతి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆమెకు చదువుకు అవసరమయ్యే ఖర్చు భరిస్తామని, జ్యోతి తండ్రికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

Super 30 founder Anand Kumar offers free IIT-JEE coaching to ‘cycle girl’ Jyoti Kumari

Latest Updates