‘కౌన్‌ బనేగా కరోడ్‌‌పతి’ లోకి ప్రముఖ మ్యాథ‌మెటీషియ‌న్

సూపర్‌ 30 ఫౌండర్ , ‍‍ప్రముఖ మ్యాథ‌మెటీషియ‌న్ ఆనంద్‌ కుమార్ మరోసారి ‘కౌన్‌ బనేగా కరోడ్‌‌పతి’ లో అడుగుపెట్టనున్నారు. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌‌పతి  షో త్వరలో ఎపిసోడ్‌ 51, 61,62లు జరగనున్నాయి. ఈ షోలో పాల్గొనాల్సిందిగా కేబీసీ ఆనంద్‌ను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. కాగా  2017లో మొదటిసారి కేబీసీలో పాల్గొన్న ఆనంద్ గేమ్  ఆడి రూ.25 లక్షల్ని గెలుచుకున్నారు. గేమ్ ఆడటమే కాదు..వ్యాఖ్యాతగా ఉన్న అమితాబ్ కు  ‘అరక్షణ్‌’ సినిమాలోని పాత్రకు  కొన్ని సలహాలిచ్చారు.

Latest Updates